కావేరీ సీడ్స్‌ లాభం రూ.37 కోట్లు

ABN , First Publish Date - 2023-01-25T01:03:00+05:30 IST

కావేరీ సీడ్స్‌.. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.37.54 కోట్ల నికర లాభాన్ని...

కావేరీ సీడ్స్‌ లాభం రూ.37 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కావేరీ సీడ్స్‌.. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.37.54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.9.08 కోట్లతో పోలిస్తే 313.24 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం కూడా 21 శాతం వృద్ధితో రూ.102.08 కోట్ల నుంచి రూ.123.49 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.125.37 కోట్లకు 23,99,831 షేర్లను కంపెనీ కొనుగోలు చేసింది.

Updated Date - 2023-01-25T01:03:00+05:30 IST