Share News

కావేరీ సీడ్స్‌ మళ్లీ షేర్ల బైబ్యాక్‌!

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:36 AM

కావేరీ సీడ్‌ కంపెనీ మళ్లీ షేర్ల బైబ్యాక్‌కు వచ్చే అంశాన్ని పరిశీలించనుంది. షేర్ల బైబ్యాక్‌, ఇతర అంశాలను...

కావేరీ సీడ్స్‌ మళ్లీ షేర్ల బైబ్యాక్‌!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కావేరీ సీడ్‌ కంపెనీ మళ్లీ షేర్ల బైబ్యాక్‌కు వచ్చే అంశాన్ని పరిశీలించనుంది. షేర్ల బైబ్యాక్‌, ఇతర అంశాలను పరిశీలించడానికి జనవరి 5న బోర్డు సమావేశం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. వెనక్కి కొనుగోలు చేసే షేర్లు, ధర తదితర అంశాలపై ఈ సమావేశంలో బోర్డు చర్చించనుంది. కావేరీ సీడ్‌ 2022 చివర్లో రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ను రూ.700 వరకూ చెల్లించి షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఇందుకు దాదాపు రూ.125 కోట్లను వెచ్చించింది. 2021 ఆగస్టులో కూడా దాదాపు రూ.120 కోట్లను చెల్లించి ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేసింది.

Updated Date - Dec 31 , 2023 | 03:36 AM