ఎన్‌ఎండీసీ స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలు రేసులో జేఎస్‌డబ్ల్యూ, ఆర్సెలార్‌ మిట్టల్‌

ABN , First Publish Date - 2023-02-20T01:54:05+05:30 IST

చత్తీ్‌సగఢ్‌లో ఎన్‌ఎండీసీ ఏర్పాటు చేసిన స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలు కోసం జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ గ్రూప్‌ పోటీపడుతున్నాయి. ఇందుకోసం రెండు సంస్థలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ సమర్పించాయి...

ఎన్‌ఎండీసీ స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలు రేసులో జేఎస్‌డబ్ల్యూ, ఆర్సెలార్‌ మిట్టల్‌

  • నేడు కంపెనీ షేర్ల లిస్టింగ్‌

ముంబై: చత్తీ్‌సగఢ్‌లో ఎన్‌ఎండీసీ ఏర్పాటు చేసిన స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలు కోసం జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ గ్రూప్‌ పోటీపడుతున్నాయి. ఇందుకోసం రెండు సంస్థలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ సమర్పించాయి. మరోవైపు ఎన్‌ఎండీసీ స్టీల్‌ షేర్లు సోమవారం స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాబోతున్నాయి. ఈ లిస్టింగ్‌ ధర ఆధారంగా జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ గ్రూప్‌ తమ తుది బిడ్స్‌ సమర్పించనున్నాయి. ఏటా 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న ఈ ప్లాంట్‌ కోసం ఎన్‌ఎండీసీ రూ.22,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ముందు అనుకున్న దానికంటే ఇది రూ.7,000 కోట్లు ఎక్కువ. వివిధ సమస్యలతో ప్లాంట్‌ నిర్మాణమూ ఏడేళ్లు ఆలస్యమైంది.

రూ.5,000 కోట్లు నష్టం: ఈ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఎన్‌ఎండీసీ రూ.22,000 కోట్లు ఖర్చు చేసినా.. బుక్‌ వాల్యూ రూ.17,000 కోట్లు మించి ఉండదని విశ్లేషకుల అంచనా. ఈ లెక్కన చూసినా ఎన్‌ఎండీసీ స్టీలు షేర్లు సోమవారం రూ.58 వద్ద లిస్ట్‌ కావాలి. అయితే పెట్టుబడుల ఉపసంహరణ ఇంకా తేలకపోవడంతో కంపెనీ షేర్లు రూ.23 నుంచి రూ.30 మద్య లిస్టయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లిస్టింగ్‌ను బట్టి ఈ సంవత్సరం మార్చిలోగా ఈ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2023-02-20T01:54:08+05:30 IST