జియో ఫైనాన్షియల్ లిస్టింగ్.. ప్చ్
ABN , First Publish Date - 2023-08-22T01:59:01+05:30 IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విభజించిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎ్‌ఫఎ్‌సఎల్) షేర్లు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదయ్యాయి.
తొలి రోజు ట్రేడింగ్‌లో 5% క్షీణించి లోయర్ సర్క్యూట్‌ను తాకిన షేరు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విభజించిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎ్‌ఫఎ్‌సఎల్) షేర్లు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదయ్యాయి. తొలి రోజు ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు దాదాపు 5 శాతం క్షీణించి లోయర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకింది. గత నెల 20న ఎన్‌ఎ్‌సఈలో నిర్వహించిన ప్రత్యేక ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ సెషన్ ద్వారా జేఎ్‌ఫఎ్‌సఎల్ షేరు ధరను రూ.261.85గా ఖరారు చేశారు. ఈ ధరతో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు ట్రేడింగ్ 1.20 శాతం ప్రీమియంతో రూ.265 వద్ద ప్రారంభమైంది. కానీ, ఆ తర్వాత 3.85 శాతం తగ్గి రూ.251.75 వద్దకు పడిపోయింది. కాగా, ఎన్‌ఎ్‌సఈలో జేఎ్‌ఫఎ్‌సఎల్ షేరు రూ.262 వద్ద లిస్టయినప్పటికీ, చివరికి 4.94 శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ లిమిట్ రూ.248.90 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో కంపెనీకి చెందిన 35.51 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 7.47 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. కాగా, జేఎ్‌ఫఎ్‌సల్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) షేరు బీఎ్‌సఈలో 1.50 శాతం నష్టపోయి రూ.2,518.25 వద్ద ముగిసింది.
జూ బీఎ్‌సఈలో ట్రేడింగ్ ముగిసేసరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.1,59,943.93 కోట్లుగా నమోదైంది. తద్వారా మార్కెట్లో అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో జేఎ్‌ఫఎ్‌సఎల్ 34వ స్థానంలో నిలిచింది.
జూ జేఎ్‌ఫఎ్‌సఎల్ షేరును మొదటి పది రోజుల పాటు టీ (ట్రేడ్ ఫర్ ట్రేడ్) గ్రూప్ సెక్యూరిటీల జాబితాలో చేర్చినందున.. 5 శాతం సర్క్యూట్ లిమిట్ వర్తిస్తుంది. అంతేకాదు, టీ సెగ్మెంట్‌లో చేర్చినందున ప్రస్తుతం ఈ షేరులో ఇంట్రాడే, నేడు కొనుగోలు.. రేపు విక్రయం (బై టుడే.. సెల్ టుమారో) ట్రేడింగ్‌కు అనుమతి లేదు.
జూ జేఎ్‌ఫఎ్‌సఎల్ షేరు రూ.300 స్థాయిలో నమోదు కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆర్‌ఐఎల్‌లో పెట్టుబడులు కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు జేఎ్‌ఫఎ్‌సఎల్ షేర్లలో భారీగా అమ్మకాలకు పాల్పడటంతో మార్కెట్ అంచనాల కంటే చాలా తక్కువ స్థాయిలో లిస్టవడంతోపాటు తొలి రోజే లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
జూ వ్యాపార విభజనలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వాటాదారులకు వారు కలిగి ఉన్న ప్రతి ఒక్క షేరుకు గాను ఒక జేఎ్‌ఫఎ్‌సఎల్ షేరును కేటాయించింది.
సెన్సెక్స్
267 పాయింట్లు అప్
గత వారంలో చివరి రెండు రోజులు నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు.. ఈ వారం లాభాలతో ఆరంభం పలికాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. ఇన్ఫోసిస్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దాంతో సెన్సెక్స్ మళ్లీ 65,000 ఎగువకు చేరుకోగలిగింది. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి సూచీ 267.43 పాయింట్ల వృద్ధితో 65,216.09 వద్దకు ఎగబాకింది. నిఫ్టీ 83.45 పాయింట్లు పెరిగి 19,393.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 23 లాభపడ్డాయి.
జూన్ నాటికి
రూ.51.33 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ ఇది..
ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికం ముగిసేనాటికి భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎ్‌ఫపీఐ) మొత్తం పెట్టుబడుల విలువ 62,600 కోట్ల డాలర్లకు (రూ.51.33 లక్షల కోట్లు) చేరుకుంది. గత ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన 52,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే, విలువ 20 శాతం పెరిగిందని మార్నింగ్‌స్టార్ వెల్లడించింది. ఈ జనవరి-మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి నమోదైన 54,200 కోట్ల డాలర్ల పెట్టుబడులతో పోల్చినా విలువలో 15 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది.