Share News

‘గో ఫస్ట్‌’ బిడ్డింగ్‌కు జిందాల్‌ పవర్‌ గుడ్‌బై!

ABN , First Publish Date - 2023-11-22T01:14:09+05:30 IST

దివాలా ప్రక్రియలో ఉన్న బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ‘గో ఫస్ట్‌’ ఇప్పట్లో మళ్లీ ఎగిరే సూచనలు కనిపించడం లేదు. ఈ సంస్థల ఆస్తుల కొనుగోలు కోసం బిడ్‌...

‘గో ఫస్ట్‌’ బిడ్డింగ్‌కు జిందాల్‌ పవర్‌ గుడ్‌బై!

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ‘గో ఫస్ట్‌’ ఇప్పట్లో మళ్లీ ఎగిరే సూచనలు కనిపించడం లేదు. ఈ సంస్థల ఆస్తుల కొనుగోలు కోసం బిడ్‌ సమర్పించకూడదని జిందాల్‌ పవర్‌ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్‌ ఆస్తుల కోసం ప్రాంతీయ విమానయాన సంస్థ జెట్‌వింగ్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఒక్కటే రంగంలో ఉన్నట్టు భావిస్తున్నారు. దివాలా ప్రక్రియలో ఉన్నా.. విమానయాన సంస్థల విమానాల స్వాధీనానికి లీజు సంస్థలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో జిందాల్‌ వర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు భావిస్తున్నారు.

Updated Date - 2023-11-22T01:14:11+05:30 IST