నెల రోజుల్లోనే ఐటీ రిఫండ్స్‌

ABN , First Publish Date - 2023-06-03T01:26:53+05:30 IST

ఐటీ రిఫండ్స్‌ సమయాన్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23) గణనీయంగా తగ్గించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ నితిన్‌ గుప్తా చెప్పారు.

నెల రోజుల్లోనే ఐటీ రిఫండ్స్‌

సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌ గుప్తా

న్యూఢిల్లీ: ఐటీ రిఫండ్స్‌ సమయాన్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23) గణనీయంగా తగ్గించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ నితిన్‌ గుప్తా చెప్పారు. దాదాపు 80 శాతం రిఫండ్స్‌ను రిటర్న్‌లు ఫైల్‌ చేసిన నెల రోజుల్లోనే జారీ చేసినట్టు తెలిపారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువన్నారు. ఇదే సమయంలో ఐటీ రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్‌ సమయాన్నీ 26 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగించడంతో ఇది సాధ్యమైందన్నారు. 2021-22 అసె్‌సమెంట్‌ సంవత్సరంలో ఒకే రోజు ప్రాసెస్‌ చేసిన రిటర్న్‌లు 21 శాతం ఉంటే, 2022-23 అసె్‌సమెంట్‌ సంవత్సరంలో ఇది 42 శాతానికి చేరినట్టు తెలిపారు. గత ఏడాది జూలై 28న రికార్డు స్థాయిలో 22.94 లక్షల ఐటీ రిటర్న్‌లను ఒకే రోజు ప్రాసెస్‌ చేసినట్టు గుప్తా చెప్పారు.

Updated Date - 2023-06-03T01:26:53+05:30 IST