రైల్‌వైర్‌ ఖాతాదారులకు ఐపీటీవీ సేవలు

ABN , First Publish Date - 2023-01-20T03:45:39+05:30 IST

రైల్వే శాఖ అనుబంధ సంస్థ ‘రైల్‌టెల్‌’ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ‘రైల్‌వైర్‌’ బ్రాడ్‌బ్యాండ్‌ రిటైల్‌...

రైల్‌వైర్‌ ఖాతాదారులకు ఐపీటీవీ సేవలు

హైదరాబాద్‌ కంపెనీతో జట్టు: రైల్‌టెల్‌

న్యూఢిల్లీ: రైల్వే శాఖ అనుబంధ సంస్థ ‘రైల్‌టెల్‌’ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ‘రైల్‌వైర్‌’ బ్రాడ్‌బ్యాండ్‌ రిటైల్‌ ఖాతాదారులకు ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ టీవీ (ఐపీటీవీ) సేవలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఐపీటీవీ సేవల సంస్థ ‘సిటీ ఆన్‌లైన్‌ మీడియా’తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఉల్కా టీవీ’ పేరుతో ఈ నెల 26 నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఈ ఏర్పాటు ద్వారా అత్యంత స్పష్టతతో 600కుపైగా టీవీ చానల్స్‌ను చూడవచ్చు. తొలుత దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయి. తర్వాత ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు.

Updated Date - 2023-01-20T03:45:40+05:30 IST