Share News

ఇళ్ల కొనుగోళ్లకు వడ్డీరేట్ల దెబ్బ

ABN , First Publish Date - 2023-12-11T04:11:08+05:30 IST

వడ్డీరేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం, డిమాండ్‌లో వృద్ధి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలను దెబ్బతీస్తోంది. మధ్య, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులు...

ఇళ్ల కొనుగోళ్లకు వడ్డీరేట్ల దెబ్బ

  • జేఎల్‌ఎల్‌ ఇండియా

న్యూఢిల్లీ: వడ్డీరేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం, డిమాండ్‌లో వృద్ధి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలను దెబ్బతీస్తోంది. మధ్య, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇళ్ల ధరలు, వడ్డీరేట్లు వారికి అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని జేఎల్‌ఎల్‌ ఇండియా ‘హోమ్‌ పర్చేజ్‌ అఫర్డబిలిటీ ఇండెక్స్‌’ (హెచ్‌పీఏఐ) పేర్కొంది. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నదని ఆ నివేదిక తెలిపింది. అయితే వచ్చే ఏడాది రెపోరేటు 0.6 నుంచి 0.8 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా. అదే జరిగితే ఇళ్ల ధరలు కొంత వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రభావం ఇళ్ల అమ్మకాల పైనా ఉంటుందని పేర్కొంది.

ఇదీ కొలమానం: అందుబాటు ధరల నిర్ణయానికి జేఎల్‌ఎల్‌ ఇండియా ఈ కింది కొలమానాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇళ్ల కొనుగోలుకు సాధారణంగా ఎన్ని సంవత్సరాల సగటు ఆదాయం కావాలి, హోమ్‌లోన్లపై వడ్డీరేటు, అనే అంశా ల ఆధారంగా జేఎల్‌ఎల్‌ ఇండియా తన హెచ్‌పీఏఐని రూపొందించింది. వెయ్యి చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణం ఉన్న ఒక ఇంటి కొనుగోలుకు సగటు వార్షికాదాయ నిష్పత్తి ఇంటి ధరలో 100 ఉంటే ఆ ఇంటి కొనుగోలుదారు హోమ్‌లోన్‌కు అర్హత ఉన్నట్టు, తక్కువగా ఉంటే అర్హత లేనట్టు తెలిపింది.

హైదరాబాద్‌పైనా ప్రభావం : ఈ ప్రభావం హైదరాబాద్‌ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. గత రెండేళ్లలో హైదరాబాద్‌లో ఈ నిష్పత్తి 174 నుంచి 169కి పడిపోయింది. అంటే అక్కడి వ్యక్తుల సగటు వార్షికాదాయంపై బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు గృహ రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.

Updated Date - 2023-12-11T04:11:10+05:30 IST