Share News

లాభాల్లోకి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2023-11-01T04:23:35+05:30 IST

ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మళ్లీ లాభాల్లోకి అడుగుపెట్టింది. రిఫైనింగ్‌, మార్కెటింగ్‌ మార్జిన్ల దన్నుతో సెప్టెంబరు త్రైమాసికంలో...

లాభాల్లోకి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌

లాభాల్లోకి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మళ్లీ లాభాల్లోకి అడుగుపెట్టింది. రిఫైనింగ్‌, మార్కెటింగ్‌ మార్జిన్ల దన్నుతో సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ.12,967.32 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఓసీ రూ.272.35 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.2.02 లక్షల కోట్లుగా ఉంది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

Updated Date - 2023-11-01T04:23:35+05:30 IST