Share News

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!

ABN , First Publish Date - 2023-11-20T01:55:10+05:30 IST

భారత జీడీపీ నాలుగు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.333.16 లక్షల కోట్లు) స్థాయిని దాటినట్టు ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్టు సోషల్‌ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి...

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!

న్యూఢిల్లీ: భారత జీడీపీ నాలుగు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.333.16 లక్షల కోట్లు) స్థాయిని దాటినట్టు ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్టు సోషల్‌ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. వెంటనే దీనికి అభినందనలు చెబుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌)లో ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్ర మంత్రులు జీ కిషన్‌ రెడ్డి, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలే ఇందుకు కారణమని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. అయితే ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖగానీ, జాతీయ గణాంక శాఖ (ఎన్‌ఎ్‌సఓ) గానీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఈ వార్తలు నిజమైతే అమెరికా, చైనా, జపాన్‌ తర్వాత భారత్‌ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది.

Updated Date - 2023-11-20T01:55:14+05:30 IST