టాటా క్యాన్సర్‌ హాస్పిటల్స్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ దన్ను

ABN , First Publish Date - 2023-06-03T01:25:22+05:30 IST

టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ).. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్రల్లోని తన క్యాన్సర్‌ ఆస్పత్రులను మరింత విస్తరించనుంది.

టాటా క్యాన్సర్‌ హాస్పిటల్స్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ దన్ను

రూ.1,200 కోట్ల సాయం

ఆసుపత్రుల్లో మరిన్ని సదుపాయాలు

ముంబై: టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ).. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్రల్లోని తన క్యాన్సర్‌ ఆస్పత్రులను మరింత విస్తరించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇందుకోసం తన సీఎ్‌సఆర్‌ నిధుల నుంచి వచ్చే నాలుగేళ్లలో రూ.1,200 కోట్లు కేటాయిస్తుంది. ఏపీలోని విశాఖపట్నం, మహారాష్ట్రలోని నవీ ముంబై సమీపంలోని ఖర్గార్‌, పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌ వద్ద ఈ మూడు క్యాన్సర్‌ హాస్పిటల్స్‌ ఉన్నాయి. వీటి విస్తరణ 2027 నాటికి పూర్తవుతుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ చైర్మన్‌ గిరీశ్‌ చంద్ర చతుర్వేది చెప్పారు. దీంతో టీఎంసీ నిర్వహణలోని క్యాన్సర్‌ ఆస్పత్రులు ఏటా అదనంగా మరో 25,000 మందికి సేవలు అందించగలుగుతాయి.

వైజాగ్‌లో మరిన్ని సేవలు: ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఎ్‌సఆర్‌ నిధులతో వైజాగ్‌ గాజువాక ప్రాంతంలోని టాటా క్యాన్సర్‌ ఆస్పత్రిలో మరిన్ని సదుపాయలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా రక్త క్యాన్సర్‌, క్యాన్సర్‌ బాధిత పిల్లల చికిత్స కోసం గాజువాక ఆస్పత్రిలో రెండు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2023-06-03T01:25:39+05:30 IST