హైదరాబాద్‌ టు ఫ్రాంక్‌ఫర్ట్‌

ABN , First Publish Date - 2023-05-26T04:52:15+05:30 IST

జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులను లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించనుంది.

హైదరాబాద్‌ టు ఫ్రాంక్‌ఫర్ట్‌

వచ్చే ఏడాది నుంచి లుఫ్తాన్సా విమాన సర్వీసులు అందుబాటులోకి

శంషాబాద్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులను లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించనుంది. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి బోయింగ్‌ బీ787–9 డ్రీమ్‌లైనర్‌తో ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌–హైదరాబాద్‌ మధ్య వారానికి మూడు సార్లు (మంగళ, శుక్ర, ఆదివారం) ఈ సర్వీసు అందుబాటులో ఉండనుంది. అలాగే హైదరాబాద్‌ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు సోమ, బుధ, శని వారాల్లో బయలుదేరుతుంది. యూరప్‌లోని పలు నగరాలతో పాటు అమెరికా, కెనడాలోని నగరాలకు చేరుకునేందుకు ఈ విమాన సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది.


Updated Date - 2023-05-26T04:52:15+05:30 IST