భారీగా తగ్గిన వెండి
ABN , First Publish Date - 2023-03-09T01:54:00+05:30 IST
దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి(24 క్యారెట్లు) బంగారం రేటు రూ.615 తగ్గి రూ.55,095కు జారుకుంది...
కిలోపై రూ.2,285 తగ్గుదల
తులం బంగారం రూ.615 డౌన్
న్యూఢిల్లీ: దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి(24 క్యారెట్లు) బంగారం రేటు రూ.615 తగ్గి రూ.55,095కు జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.2,285 తగ్గి రూ.62,025 ధర పలికింది. అంతర్జాతీయంగా వీటికి డిమాండ్ అనూహ్యంగా తగ్గడం ఇందుకు కారణమైందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒకదశలో 1,814 డాలర్లు, సిల్వర్ 20 డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. ఫెడ్ రేట్లు మరింత అధికంగా పెరగనున్నాయన్న సంకేతాలు డాలర్‌ను బలపర్చడంతో బులియన్ రేట్లు బలహీపడ్డాయని విశ్లేషకులు తెలిపారు.