హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభంలో 20% వృద్ధి
ABN , First Publish Date - 2023-01-15T00:12:58+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబరు-డిసెంబరు) హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 19.9 శాతం పెరిగి రూ.12,698
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబరు-డిసెంబరు) హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 19.9 శాతం పెరిగి రూ.12,698 కోట్లకు ఎగబాకింది. కీలక వడ్డీ ఆదాయంలో మెరుగైన వృద్ధి ఇందుకు ప్రధానంగా దోహదపడింది. సమీక్షా కాలానికి కీలక వడ్డీ ఆదాయం 24.6 శాతం వృద్ధితో రూ.22,987.8 కోట్లకు చేరుకుంది. రుణాలు 19.5 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 4.1 శాతంగా నమోదైంది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలలకు బ్యాంక్ ఇతర ఆదాయం కూడా రూ.8,499.84 కోట్లకు పెరిగింది. కాగా, నిర్వహణ ఖర్చులు కూడా 26.5 శాతం పెరుగుదలతో రూ.12,463.6 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, డిసెంబరు చివరినాటికి బ్యాంక్ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్ ఎన్‌పీఏ) 1.23 శాతంగా నమోదయ్యాయి.