బీమాలో జోరుగా టెక్నాలజీ వినియోగం

ABN , First Publish Date - 2023-03-26T04:24:47+05:30 IST

తయారీ, లాజిస్టిక్స్‌, రిటైల్‌, హెల్త్‌కేర్‌ వంటి రంగాల్లో టెక్నాలజీ ఏ విధంగా మార్పు లు తీసుకువచ్చిందో అదే విధంగా బీమా రంగంలో డిజిటల్‌ టెక్నాలజీల...

బీమాలో జోరుగా టెక్నాలజీ వినియోగం

  • నిధులు కేటాయిస్తున్న కంపెనీలు

  • ‘ఆంధ్రజ్యోతి’తో ఇండియాఫస్ట్‌ లైఫ్‌ సీఎ్‌సఓ అంజనరావు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తయారీ, లాజిస్టిక్స్‌, రిటైల్‌, హెల్త్‌కేర్‌ వంటి రంగాల్లో టెక్నాలజీ ఏ విధంగా మార్పు లు తీసుకువచ్చిందో అదే విధంగా బీమా రంగంలో డిజిటల్‌ టెక్నాలజీల వాడకం వేగంగా పెరుగుతోంది. క్లయింట్ల తీరును ముందుగానే అర్థం చేసుకోవడానికి ప్రిడెక్టివ్‌ అనలిటిక్స్‌ను బీమా కంపెనీలు వినియోగిస్తున్నాయని ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ స్ట్రాటిజిక్‌ ఆఫీసర్‌ (సీఎ్‌సఓ) అంజన రావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బీమా రంగంలోని కంపెనీలు ఐఓటీ, ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.

రిస్క్‌ అసె్‌సమెంట్‌లో..

ముఖ్యంగా రిస్క్‌ను అంచనా వేయడంలో బీమా కంపెనీలు డేటా విశ్లేషణను వినియోగిస్తున్నాయి. దీంతో పాటు ఫ్రాడ్‌ రిస్క్‌, ప్రైసింగ్‌ మొదలైన వాటిని నిర్ణయించడంలో కూడా డిజిటల్‌ టెక్నాలజీలు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సాధారణ బీమా రంగంలో టైమింగ్‌ తీరు తెన్నులను విశ్లేషించి రేటింగ్‌ ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని.. ఈ రేటింగ్‌ను బట్టి బీమా ప్రీమియంలను నిర్ణయించవచ్చు. ఇందుకు అనుగుణంగా కస్టమైజ్డ్‌ ఉత్పత్తులను కంపెనీలు రూపకల్పన చేసే వీలుందని చెప్పారు. క్లెయిమ్‌లు వేగంగా ప్రాసెస్‌ కావడానికి, క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేసే నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు వర్చువల్‌ రియాల్టీ వంటి టెక్నాలజీలు దోహదం చేస్తున్నాయని వివరించారు.

Updated Date - 2023-03-26T04:24:47+05:30 IST