హృద్రోగ చికిత్సకు గ్లెన్‌మార్క్‌ జెనరిక్‌ ఔషధం

ABN , First Publish Date - 2023-01-18T00:35:57+05:30 IST

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌.. హార్ట్‌ ఫెయిల్యూర్‌ చికిత్సలో ఉపయోగించే నోవార్టిస్‌ ఔషధం వైమాడా జెనరిక్‌ టాబ్లెట్లను సాకు-వి పేరుతో విడుదల...

హృద్రోగ చికిత్సకు గ్లెన్‌మార్క్‌ జెనరిక్‌ ఔషధం

న్యూఢిల్లీ: గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌.. హార్ట్‌ ఫెయిల్యూర్‌ చికిత్సలో ఉపయోగించే నోవార్టిస్‌ ఔషధం వైమాడా జెనరిక్‌ టాబ్లెట్లను సాకు-వి పేరుతో విడుదల చేసింది. ఇది సాకుబిట్రిల్‌-వల్సట్రాన్‌ కాంబినేషన్‌ టాబ్లెట్లకు జెనరిక్‌ వెర్షన్‌. సాకు -వి టాబ్లెట్‌ 50 ఎంజీ ధర రూ.19, 100 ఎంజీ ధర రూ.35, 200 ఎంజీ ధర రూ.45గా నిర్ణయించారు. ఇది రూ.20,000 కోట్ల విలువ గల కార్డియాక్‌ ఔషధాల మార్కెట్లో ఒక విప్లవం కానుంది. ఈ విభాగంలో తాము కనీసం మరో 40 బ్రాండ్లు విడుదల చేయననున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) శీతల్‌ సపాలే చెప్పారు. ఈ బ్రాండ్ల రాకతో హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమయంలో వినియోగించే ఔషధాల ధర 50 శాతం మేరకు తగ్గుతుందన్నారు. హార్ట్‌ ఫెయిల్యూర్‌ కేసుల్లో 30 -35 శాతం రోగులకు డాక్టర్లు ఎక్కువగా సాకుబిట్రిల్‌-వల్సట్రాన్‌ కాంబినేషన్‌నే సిఫారసు చేస్తున్నారు. సరైన ధర నిర్ణయించినట్టయితే ఈ వాటా 50-60 శాతానికి పెరుగుతుందని వైద్యులంటున్నారు. కార్డియో వాస్కులర్‌ మరణాల రిస్క్‌ను తగ్గించి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ లక్షణాలను తగ్గించే సాకు-వి రోగులకు అందుబాటు ధరల్లో లభించే ఔషధంగా నిలుస్తుందని గ్లెన్‌మార్క్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ మాలిక్‌ అన్నారు.

Updated Date - 2023-01-18T00:45:10+05:30 IST