లేచి.. పడి.. లేచాయ్!
ABN , First Publish Date - 2023-03-18T01:18:45+05:30 IST
మెరుగైన లాభాలతో వారాంతపు ట్రేడింగ్‌ను ప్రారంభించిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివరికి లాభాల్లో ముగిసాయి....

తీవ్ర ఊగిసలాటల్లోనూలాభాపడిన సూచీలు
సెన్సెక్స్ 355 పాయింట్లు అప్
ముంబై: మెరుగైన లాభాలతో వారాంతపు ట్రేడింగ్‌ను ప్రారంభించిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివరికి లాభాల్లో ముగిసాయి. శుక్రవారం సెన్సెక్స్ 355.06 పాయింట్ల లాభం తో 57,989.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు బలపడి 17,100.05 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 21 ఎగబాకాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి విలువ కూడా 18 పైసలు బలపడి రూ.82.58 వద్ద ముగిసింది. మరిన్ని విషయాలు..
అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో 7 లాభపడ్డాయి. గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 1.88 శాతం పెరిగి రూ.1,877.15 వద్ద స్థిరపడింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ విల్మర్‌కు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఊరట కల్పించాయి. ఈ మూడు కంపెనీల షేర్లను స్వల్పకాలిక అదనపు నిఘా చర్యల (ఏఎ్‌సఎం) జాబితా నుంచి తప్పించినట్లు ఎన్‌ఎ్‌సఈ, బీఎ్‌సఈ వెల్లడించాయి.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎ్‌ఫపీఐ)కు నిబంధనలను సెబీ మరింత కఠినతరం చేసింది. కంపెనీ నిర్మా ణం, యాజమాన్య సంబంధిత మార్పులను ఏడు పనిదినాల్లో తమకు వెల్లడించాలని ఆదేశించింది.