మాంద్యంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ
ABN , First Publish Date - 2023-05-26T04:49:14+05:30 IST
యూరప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ మాంద్యంలో చిక్కుకుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో జర్మనీ జీడీపీ వృద్ధి రేటు మైనస్ 0.3 శాతంగా నమోదైంది.

బెర్లిన్: యూరప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ మాంద్యంలో చిక్కుకుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో జర్మనీ జీడీపీ వృద్ధి రేటు మైనస్ 0.3 శాతంగా నమోదైంది. గత ఏడాది డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలోనూ జర్మనీ జీడీపీ మైనస్ 0.5 శాతం పడిపోయింది. ఏ దేశ జీడీపీ అయినా వరుసగా రెండు త్రైమాసికాలు మైనస్ వృద్ధి రేటు నమోదైతే, సాంకేతికంగా ఆ దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నట్టు భావిస్తారు. ఈ లెక్కన జర్మనీ ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నట్టయింది. మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తగ్గుముఖం పట్టినా అధిక వడ్డీ రేట్లు జర్మనీ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరుస్తున్నాయి.