మరింత తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

ABN , First Publish Date - 2023-06-03T01:28:37+05:30 IST

వరుసగా రెండో వారం విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు తగ్గాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా డేటా ప్రకారం..

మరింత తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

వరుసగా రెండో వారం విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు తగ్గాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా డేటా ప్రకారం.. మే 26తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు మరో 433.9 కోట్ల డాలర్ల మేర తగ్గి 58,913.8 కోట్ల డాలర్ల స్థాయికి జారుకున్నాయి. అంతక్రితం వారంలో 605.2 కోట్ల డాలర్ల మేర క్షీణించి 59,347.7 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 2021 అక్టోబరులో మన ఫారెక్స్‌ నిల్వలు ఆల్‌టైం రికార్డు స్థాయి 64,500 కోట్ల డాలర్లకు చేరాయి. కానీ, ఆ తర్వాత కాలంలో రూపాయి మార కం విలువ క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ మార్కెట్లోకి భారీగా డాలర్లను విడుదల చేయాల్సి రావడంతో నిల్వలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సహా అగ్ర దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లన్నీ వడ్డీ రేట్లు పెంచుతూ రావడం, రూపాయి పతనానికి కారణమయ్యాయి.

Updated Date - 2023-06-03T01:28:37+05:30 IST