హైదరాబాద్‌లో తొలి ఫెడ్‌ఎక్స్ ఏసీసీ
ABN , First Publish Date - 2023-12-06T05:36:34+05:30 IST
ఫెడ్‌ఎక్స్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లో తన తొలి అడ్వాన్స్‌డ్ క్యాపబిలిటీ కమ్యూనిటీ (ఏసీసీ)ని ఏర్పాటు చేసింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఫెడ్‌ఎక్స్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లో తన తొలి అడ్వాన్స్‌డ్ క్యాపబిలిటీ కమ్యూనిటీ (ఏసీసీ)ని ఏర్పాటు చేసింది. టెక్నాలజీ, డిజిటెల్ ఇన్నోవేషన్‌కు ఇది హబ్‌గా పని చేస్తుందని ఫెడ్‌ఎక్స్ కార్పొరేషన్ ప్రెసిడెట్, సీఈఓ రాజ్ సుబ్రమణియమ్ తెలిపారు. నిపుణుల నియామకాలు జరుగుతాయి. దీంతోపాటు ఫెడ్‌ఎక్స్ అంతర్జాతీయ కార్యకలాపాలకు అవసరమైన టెక్నాలజీ సామర్థ్యాలను ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ లాజిస్టిక్స్ సొల్యూషన్లు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఏసీసీని ఏర్పాటు చేశామని.. భవిష్యత్తులో మరిన్ని ఏసీసీలను ఏర్పాటు చేయనున్నామని సుబ్రమణియమ్ చెప్పారు. దీర్ఘకాలంలో హైదరాబాద్‌లోని ఏసీసీ, ఇతర కార్యకలాపాలపై 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.800 కోట్లు) పెట్టబడులు పెట్టనునున్నట్లు ఫెడ్‌ఎక్స్ వెల్లడించింది.