జూన్‌ నాటికి విశాఖ రిఫైనరీ విస్తరణ పూర్తి

ABN , First Publish Date - 2023-01-23T03:19:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నంలోని తమ రిఫైనరీ విస్తరణ పనులు జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్టు హిందుస్థాన్‌ పెట్రో లియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) చైర్మన్‌ పుష్ప్‌ జోషి తెలిపారు...

జూన్‌ నాటికి విశాఖ రిఫైనరీ  విస్తరణ పూర్తి

వారణాసి: ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నంలోని తమ రిఫైనరీ విస్తరణ పనులు జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్టు హిందుస్థాన్‌ పెట్రో లియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) చైర్మన్‌ పుష్ప్‌ జోషి తెలిపారు. విస్తరణలో భాగంగా రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.5 కోట్ల టన్నులకు పెంచుతున్నారు. ప్రస్తుతం దీని ఉత్పాదక సామర్థ్యం 83.3 లక్షల టన్నులుంది. దీంతో పాటుగా రాజస్థాన్‌లోని బార్మర్‌లో కొత్త రిఫైనరీ నిర్మిస్తున్నట్టు చెప్పారు. వీటితో తమ ఉత్పత్తి, విక్రయాల మధ్య వ్యత్యాసం తొలగిపోతుందన్నారు. హెచ్‌పీసీఎల్‌ ప్రస్తుతం తన ఉత్పత్తి సామర్థ్యం కన్నా 50 శాతం అధిక పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ విక్రయిస్తోంది. రాజస్థాన్‌లో 90 లక్షల టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ 2024 చివరికి పూర్తవుతుందని వెల్లడించారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ నిధుల ఉపసంహరణను మొదలుపెట్టారు. చైనా మార్కెట్లు ప్రారంభం కావటం, అమెరికా మాంద్యంలోకి ప్రవేశించిందన్న వార్తలతో ఈ నెల 20వ తేదీ వరకు ఎఫ్‌పీఐలు రూ.15,236 కోట్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.

Updated Date - 2023-01-23T03:19:16+05:30 IST