Share News

అంతర్జాతీయ ట్రెండ్స్‌తోనే దిశ..!

ABN , First Publish Date - 2023-11-20T02:08:53+05:30 IST

గత వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ ధోరణి కనిపిస్తోంది...

అంతర్జాతీయ ట్రెండ్స్‌తోనే దిశ..!

గత వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ ధోరణి కనిపిస్తోంది. దీంతో ఈ వారం సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన రెండు వారాలుగా అమ్మకాలు చేపట్టిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మళ్లీ నెట్‌ బయ్యర్స్‌గా మారటం, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు మార్కెట్లకు కలిసిరానున్నాయి.

మరోవైపు ఏడాదిన్నర కాలంగా డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఐటీ రంగం మళ్లీ పుంజుకోవటం సంతోషకరమైన విషయం. అన్‌సెక్యూర్డ్‌ రుణాల నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేయటం, చైనా దిగ్గజ కంపెనీల షేర్లు పతనమవ్వటం, యుద్ధ వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.

స్టాక్‌ రికమండేషన్స్‌

టాటా కన్స్యూమర్‌: గత ఎనిమిది నెలలుగా ఈ కౌంటర్‌ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. డెలివరీ పరిమాణం విపరీతంగా పెరిగింది. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించి ఉండటంతో మూమెంటమ్‌ పెరిగింది. గత శుక్రవారం రూ.930.85 వద్ద క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.910/930 స్థాయి ల్లో పొజిషన్‌ తీసుకుని రూ.1,080/1,150 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.890 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హిందుస్థాన్‌ యూనీలివర్‌: కొన్ని రోజులుగా డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఈ కౌంటర్‌లో మళ్లీ మూమెంటమ్‌ కనిపిస్తోంది. కీలక మద్దతు స్థాయిలో, ఆకర్షణీయమైన ధరలో షేర్లు లభిస్తున్నాయి. డివిడెండ్‌ ప్రకటించటం, చివరి సెషన్‌లో అద్భుతమైన క్యాండిల్‌ ఏర్పడటం సానుకూల అంశాలు. గత శుక్రవారం ఈ షేరు రూ.2,528.80 వద్ద ముగిసింది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లో రూ.2,500 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.2,640/2,730 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,460 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌: నిఫ్టీతో పోల్చితే ఈ షేరు మెరుగ్గా ట్రేడవుతోంది. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత ఈ కౌంటర్‌లో అప్‌ట్రెండ్‌ మొదలైంది. గత శుక్రవారం రూ.167.30 వద్ద క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.165 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.195/245 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.154 స్థాయిని కచ్చితమైన స్టాప్‌ లా్‌సగా పెట్టుకోవాలి.

దివీస్‌ లేబొరేటరీస్‌: ఆరు నెలల అప్‌ట్రెండ్‌ తర్వాత పొజిషనల్‌ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో వరుసగా మూడు వారాలుగా ఈ షేరు నష్టాల బాటలో సాగింది. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ షేరులో మూమెంటమ్‌ పెరిగింది. దీంతో మూమెంటమ్‌ ఇన్వెస్టర్లు పొజిషన్‌ తీసుకోవటానికి ప్రస్తుతం ఈ కౌంటర్‌ అనుకూలంగా ఉంది. గత శుక్రవారం ఈ షేరు రూ.3,600.85 వద్ద క్లోజైంది. ట్రేడ ర్లు ఈ షేరులో రూ.3,500/3,600 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.3,880/4,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,500 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ లైఫ్‌: సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో ప్రస్తుతం ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,413.95 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ షేరును రూ.1,400 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.1,530/ 1,655 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.1,340 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్ట్‌ మాస్టర్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి

Updated Date - 2023-11-20T02:08:54+05:30 IST