అప్పుల చెల్లింపు సమస్యే కాదు : అదానీ గ్రూప్‌

ABN , First Publish Date - 2023-03-31T01:51:31+05:30 IST

అదానీ గ్రూప్‌ మళ్లీ పెద్దఎత్తున అప్పుల వేట ప్రారంభించింది. ఇందుకోసం సింగపూర్‌ నుంచి అమెరికా వరకు రోడ్‌షోలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉన్న రూ.1.89 లక్షల కోట్ల అప్పుల చెల్లింపు తమకు సమస్యే కాదని...

అప్పుల చెల్లింపు సమస్యే కాదు : అదానీ గ్రూప్‌

ముంబై: అదానీ గ్రూప్‌ మళ్లీ పెద్దఎత్తున అప్పుల వేట ప్రారంభించింది. ఇందుకోసం సింగపూర్‌ నుంచి అమెరికా వరకు రోడ్‌షోలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉన్న రూ.1.89 లక్షల కోట్ల అప్పుల చెల్లింపు తమకు సమస్యే కాదని అదానీ గ్రూప్‌ ఉన్నతాధికారులు ఈ రోడ్‌షోల్లో రుణదాతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రూప్‌ కంపెనీల వార్షిక స్థూల లాభాలే ప్రస్తుతం ఏటా రూ.61,200 కోట్ల వరకు ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. వచ్చే రెండు మూడేళ్లలోనూ ఈ లాభాలు ఏటా 20 శాతం చొప్పున పెరుగుతాయని, అందువల్ల తమ అప్పుల చెల్లింపుల సామర్ధ్యంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పారు.

Updated Date - 2023-03-31T01:51:37+05:30 IST