ఏపీ,తెలంగాణల్లో క్రిభ్‌కో బయో ఇథనాల్ ప్లాంట్లు
ABN , First Publish Date - 2023-09-22T01:25:27+05:30 IST
క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్‌కో).. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్‌ల్లో బయో ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది...
న్యూఢిల్లీ: క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్‌కో).. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్‌ల్లో బయో ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో క్రిభ్‌కో చైర్మన్ చంద్ర పాల్ సింగ్ ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తెలంగాణలోని జగిత్యాల, గుజరాత్‌లోని హజీరా వద్ద అనుబంధ సంస్థ క్రిభ్‌కో గ్రీన్ ఎనర్జీ ఈ బయో ఇథనాల్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనుందని ఆయన పేర్కొన్నారు. క్రిభ్‌కో కార్యకలాపాల విస్తరణలో భాగంగా క్రిభ్‌కో అగ్రి బిజినెస్ లిమిటెడ్ (కేఎబీఎల్), క్రిభ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది.