స్వర్గసీమ శాండల్‌వుడ్ అధినేత చండ్ర చంద్రశేఖర్‌ను వ్యాపారరత్న పురస్కారం
ABN , First Publish Date - 2023-09-22T01:34:06+05:30 IST
రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్వర్గసీమ శాండల్‌వుడ్ అధినేత చండ్ర చంద్రశేఖర్‌ను అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా...
రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్వర్గసీమ శాండల్‌వుడ్ అధినేత చండ్ర చంద్రశేఖర్‌ను అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.. వ్యాపారరత్న పురస్కారంతో సత్కరించింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నటుడు మురళీమోహన్, అక్కినేని కుమార్తె నాగసుశీల చేతుల మీదుగా చంద్రశేఖర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.