స్టాక్ మార్కెట్లో బుల్ జోష్
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:30 AM
ఈ సంవత్సరం (2023) దేశీయ స్టాక్ మార్కెట్‌కు బాగానే కలిసొచ్చింది. ప్రారంభంలో నీరసించిన ఇండెక్స్‌లు (సూచీలు) ఆఖరి రెండు నెలల్లో రేసు గుర్రాల్లా పరిగెత్తాయి.
2023లో సరికొత్త రికార్డులు సృష్టించిన సూచీలు.. లాభాల్లో స్మాల్ క్యాప్ షేర్లదే హవా
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం (2023) దేశీయ స్టాక్ మార్కెట్‌కు బాగానే కలిసొచ్చింది. ప్రారంభంలో నీరసించిన ఇండెక్స్‌లు (సూచీలు) ఆఖరి రెండు నెలల్లో రేసు గుర్రాల్లా పరిగెత్తాయి. ఈ నెల 20న బీఎ్‌సఈ సెన్సెక్స్ 71,913 పాయింట్లకు చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. అదే రోజు బీఎ్‌సఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 42,648.86 పాయింట్లు, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 36,483.16 పాయింట్లకు చేరి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి.
స్మాల్‌క్యాప్స్‌లో భారీ లాభాలు
లార్జ్, మిడ్‌క్యా్‌ప్సతో పోలిస్తే ఈ సంవత్సరం స్మాల్‌క్యాప్ ఇండెక్స్ షేర్లు మదుపరులకు మంచి లాభాలు పంచాయి. గత ఏడాది కాలంలో సెన్సెక్స్ షేర్లలో మదుపు చేసిన మదుపరులు తమ పెట్టుబడులపై సగటున 16.87 శాతం లాభాలు పొందితే స్మాల్‌క్యాప్ ఇండెక్స్ షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై సగటున 45.20 శాతం లాభాలు పొందారు. ఇదే సమయంలో మిడ్‌క్యాప్ షేర్లలో మదుపు చేసిన మదుపరులు తమ పెట్టుబడులపై సగటున 41.74 శాతం లాభాలు పొందారు.
గత ఏడాదితో పోలిస్తే..
గత ఏడాది (2022)తో పోలిస్తే ఈ సంవత్సరం దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులకు మంచి లాభాలు పంచింది. గత ఏడాది సెన్సెక్ప్ షేర్లు సగటున 4.44 శాతం, మిడ్ క్యాప్ షేర్లు 1.37 శాతం లాభాలు పంచగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ షేర్లు 1.8 శాతం నష్టాలు పంచాయి. ఈ ఏడాది (2023) స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థాగత మదుపరు (డీఐఐ)లే కావడం విశేషం. 2023లో మంచి లాభాలు పంచిన స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఇండెక్స్ షేర్లు 2024లో కొంత నీరసించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
ఈ షేర్లంటే ఎంఎఫ్‌లకు మోజు
మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు ఈ ఏడాది కొన్ని కంపెనీల షేర్లను ఎగబడి కొన్నాయి. వ్యాపార కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఉండటంతో పాటు ఫండమెంటల్స్ పటిష్ఠంగా ఉండటంతో ఈ షేర్లలో ఫండ్ సంస్థలు పెద్దఎత్తున మదుపు చేశాయి. ఈ ఏడాది ఎంఎఫ్ సంస్థలు కొనుగోలు చేసిన షేర్లలో ప్రధానంగా టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఎస్‌బీఐ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, అలా్ట్రటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండ్‌సఇండ్ బ్యాంక్, కోఫోర్జ్, ఎయిర్‌టెల్, భారత్ ఎలకా్ట్రనిక్స్, నెస్లే, ఫెడరల్ బ్యాంక్, చోళమండలం ఇన్వె్‌స్టమెంట్ అండ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిండాల్కో, సిప్లా, ఇండియన్ హోటల్స్, ఎంఫసిస్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ లైఫ్, అబ్బాట్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, జూబ్లియంట్ ఫుడ్‌వర్క్స్ ఉన్నాయి. ఛ