ఆ 5 దిగ్గజ కార్పొరేట్లను విభజించండి..

ABN , First Publish Date - 2023-03-31T01:58:11+05:30 IST

భగ్గుమంటు న్న ధరలకు సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఐదు అతిపెద్ద కార్పొరేట్‌ దిగ్గజాలే...

ఆ 5 దిగ్గజ కార్పొరేట్లను విభజించండి..

  • దేశంలో ధరలు తగ్గకపోవడానికి అవే కారణం

  • ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య

న్యూఢిల్లీ: భగ్గుమంటు న్న ధరలకు సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఐదు అతిపెద్ద కార్పొరేట్‌ దిగ్గజాలే అధిక ధరలకు కారణమవుతున్నాయన్న ఆచార్య.. వా టిని విభజించాలని సూచించారు. రిలయన్స్‌ గ్రూప్‌, టాటా గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌, భారతీ టెలికాం గ్రూప్‌లు దేశంలోని ఐదు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలుగా ఉన్నాయి. స్థానిక చిన్న వ్యాపారాలకు గండి కొట్టి ఇవి దిగ్గజాలుగా ఎదిగాయన్నారు. పైగా, కేంద్ర ప్రభు త్వ అధిక టారి్‌ఫలు వీటికి విదేశీ సంస్థల పోటీ నుంచి రక్షణ కల్పిస్తున్నాయన్నారు. ‘‘జాతీయ దిగ్గజాలను తయారు చేయడమే భారత కొత్త పారిశ్రామిక విధానమని చాలామంది భావిస్తున్నారు. కానీ, ఈ విధానం దేశంలో ధరలు అధిక స్థాయిలోనే ఉండటానికి ప్రత్యక్ష కారణమవుతున్నాయ’’ని ఆచార్య పేర్కొన్నారు. కాబట్టి, బడా కార్పొరేట్లను విభజించడం ద్వారా మార్కెట్లో పోటీని పెంచడంతో పాటు వాటి ధర నిర్ణయ శక్తిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఆ వ్యూహం పనిచేయకపోతే, వాటికి బడా సంస్థలుగా కొనసాగడాన్ని అనాకర్షితంగా మార్చాలన్నారు. వర్ధమాన మార్కెట్లపై బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్యానెల్‌ వద్ద సమర్పించిన పత్రంలో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. 2017-19 మధ్యకాలంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆచార్య.. ప్రస్తుతం న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌లో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-03-31T01:58:11+05:30 IST