15 సంవత్సరాల గరిష్ఠానికి బీఓఈ వడ్డీ రేటు

ABN , First Publish Date - 2023-08-04T03:34:25+05:30 IST

వడ్డీరేట్ల విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ (బీఓఈ) కూడా అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌, యూరోజోన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) బాటనే అనుసరించింది. దిగిరానంటున్న ధరలకు కళ్లెం వేసేందుకు...

15 సంవత్సరాల గరిష్ఠానికి బీఓఈ వడ్డీ రేటు

లండన్‌: వడ్డీరేట్ల విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ (బీఓఈ) కూడా అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌, యూరోజోన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) బాటనే అనుసరించింది. దిగిరానంటున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రామాణిక వడ్డీరేట్లను మరో 0.25 శాతం పెంచుతున్నట్లు బీఓఈ గురువారం ప్రకటించింది. దాంతో అది 15 ఏళ్ల సరికొత్త గరిష్ఠ స్థాయి 5.25 శాతానికి చేరుకుంది. అంతేకాదు, బీఓఈ వడ్డీ రేట్లను పెంచడం వరుసగా ఇది 14వ సారి. గత నెలలో బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం సూచీ 7.9 శాతానికి దిగివచ్చినప్పటికీ.. బీఓఈ నియంత్రణ లక్ష్యమైన 2 శాతానికి దాదాపు నాలుగింత అధిక స్థాయిలోనే ఉంది.

Updated Date - 2023-08-04T03:34:25+05:30 IST