బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ నష్టాల నుంచి లాభాల్లోకి..
ABN , First Publish Date - 2023-05-26T04:53:45+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఇంట్రాడే నష్టాల నుంచి బయటపడి చివరకు లాభాలతో ముగిసాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఇంట్రాడే నష్టాల నుంచి బయటపడి చివరకు లాభాలతో ముగిసాయి. డెరివేటివ్స్ ముగింపుతో పాటు ఆటుపోట్ల ట్రేడింగ్ కారణంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో 61,934.01 పాయింట్లతో గరిష్ఠ స్థాయిని, 61,484.6 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు కొనుగోళ్ల దన్నుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 98.84 పాయింట్ల లాభంతో 61,872.62 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35.75 పాయింట్ల లాభంతో 18,321.15 పాయింట్ల వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని ఎల్ అండ్ టీ, ఎయిర్‌టెల్, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ముగియగా టాటా మోటార్స్, విప్రో, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ముగిసాయి.