మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎక్స్‌1

ABN , First Publish Date - 2023-01-29T01:32:22+05:30 IST

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ... భారత మార్కెట్లోకి సరికొత్త మూడోతరం బీఎండబ్ల్యూ ఎక్స్‌1 స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్‌ (ఎస్‌ఏవీ) తీసుకువచ్చింది...

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎక్స్‌1

బెంగళూరు: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ... భారత మార్కెట్లోకి సరికొత్త మూడోతరం బీఎండబ్ల్యూ ఎక్స్‌1 స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్‌ (ఎస్‌ఏవీ) తీసుకువచ్చింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవాహ్‌.. ఎక్స్‌1 ఎస్‌ఏవీని విడుదల చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. బీఎండబ్యూ ఎక్స్‌1 డీజిల్‌ వేరియంట్‌ కారు డెలివరీలు మార్చి నుంచి ప్రారంభమవుతాయని విక్రమ్‌ తెలిపారు. పెట్రోల్‌ వేరియంట్‌ కారు డెలివరీలు మాత్రం జూన్‌ నుంచి చేపట్టనున్నట్లు చెప్పారు.

బీఎండబ్ల్యూ ఎక్స్‌1 ఎస్‌ఏవీ పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.45.90 లక్షలుగా ఉండగా డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.47.90 లక్షలుగా ఉంది. ఈ రెండు కార్లను చెన్నైలోని ప్లాంట్‌లో ఉత్పత్తి చేసినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.

Updated Date - 2023-01-29T01:32:25+05:30 IST