బిగ్ సి ఉగాది ప్రత్యేక ఆఫర్లు
ABN , First Publish Date - 2023-03-18T01:14:12+05:30 IST
గడచిన రెండు దశాబ్దాలుగా మొబైల్స్ రిటైల్ రంగంలో కీలకంగా ఉన్న బిగ్ సి ఉగాది పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది....

హైదరాబాద్: గడచిన రెండు దశాబ్దాలుగా మొబైల్స్ రిటైల్ రంగంలో కీలకంగా ఉన్న బిగ్ సి ఉగాది పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఉగాదిని పురస్కరించుకుని వినియోగదారులకు మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్ కొనుగోలుపై పలు వినూత్న ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బిగ్ సి సంస్థ సీఎండీ యం బాలు చౌదరి తెలిపారు. మొబైల్స్ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్, వాయిదాల పద్ధతిలో ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ఆఫర్లతో పాటు బ్రాండెడ్ యాక్సెసరీ్‌సపై 51 శాతం వరకు డిస్కౌంట్, ఐఫోన్ కొనుగోలుపై రూ.5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 విలువైన అడాప్టర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు బాలు చౌదరి తెలిపారు. సామ్‌సంగ్ మొబైల్స్‌పై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు.