Share News

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ, డెట్‌ ఫండ్‌తో మెరుగైన రిటర్నులు

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:12 AM

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ, డెట్‌ ఫండ్‌.. మదుపరులకు మంచి రిటర్నులు అందించటంలో ముందు వరుసలో ఉంది. అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ అయిన ఈ ఫండ్‌ నిలకడైన పనితీరును...

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌  ఈక్విటీ, డెట్‌ ఫండ్‌తో మెరుగైన రిటర్నులు

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ, డెట్‌ ఫండ్‌.. మదుపరులకు మంచి రిటర్నులు అందించటంలో ముందు వరుసలో ఉంది. అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ అయిన ఈ ఫండ్‌ నిలకడైన పనితీరును కనబరుస్తూ మంచి లాభాలను అందించింది. 1999 నవంబరు 3న ప్రారంభమైన ఈ ఫండ్‌లో రూ.లక్ష పెట్టుబడిగా పెడితే ప్రస్తుతం ఈ మొత్తం రూ.29.33 లక్షలకు చేరింది. అంటే పెట్టుబడుల విలువ ఏటా 15.06 శాతం మేర వృద్ధి చెందింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 టీఆర్‌ఐ ఏటా 13.48 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒకవేళ ఈ ఫండ్‌లో క్రమానుగత పెట్టుబడి (సిప్‌) రూపంలో నెలకు రూ.10,000 పెట్టుబడిగా (మొత్తం పెట్టుబడి రూ.28.9 లక్షలు) పెడితే ఈ ఏడాది నవంబరు 30 నాటికి ఈ మొత్తం రూ.2.8 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ తెలిపింది. ఈ ఫండ్‌ లార్జ్‌ క్యాప్‌లో 90 శాతం, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ల్లో చెరో 5 శాతం పెట్టుబడులుగా పెట్టింది. కాగా ప్రస్తుతం ఈ ఫండ్‌ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.26,272.85 కోట్లుగా ఉంది.

Updated Date - Dec 18 , 2023 | 01:12 AM