బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లు పెంపు

ABN , First Publish Date - 2023-05-27T04:15:01+05:30 IST

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ఏడాది కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతానికి పెంచింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లు పెంపు

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ఏడాది కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతానికి పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ పెంపు వర్తిస్తుంది. ఈ సవరణ అనంతరం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి డిపాజిట్లపై తాము 3 నుంచి 7 శాతం మధ్యన వడ్డీ రేట్లు అందిస్తున్నట్టు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది కాలపరిమితి గల సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్లపై 7.50 శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్లపై 7.65 శాతం వడ్డీ అందిస్తున్నట్టు బీఓఐ తెలిపింది.

Updated Date - 2023-05-27T04:15:14+05:30 IST