యాక్సిస్‌ బ్యాంక్‌ ‘‘ఇన్ఫినిటీ సేవింగ్స్‌ అకౌంట్‌’’

ABN , First Publish Date - 2023-08-30T03:53:16+05:30 IST

యాక్సిస్‌ బ్యాంక్‌ వార్షిక లేదా నెలవారీ చందా ఆధారిత సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలకు మార్గం సుగమం చేస్తూ ‘‘ఇన్ఫినిటీ సేవింగ్స్‌ అకౌంట్‌’’ పేరిట కొత్త సేవింగ్స్‌ ఖాతాను...

యాక్సిస్‌ బ్యాంక్‌ ‘‘ఇన్ఫినిటీ సేవింగ్స్‌ అకౌంట్‌’’

ముంబై: యాక్సిస్‌ బ్యాంక్‌ వార్షిక లేదా నెలవారీ చందా ఆధారిత సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలకు మార్గం సుగమం చేస్తూ ‘‘ఇన్ఫినిటీ సేవింగ్స్‌ అకౌంట్‌’’ పేరిట కొత్త సేవింగ్స్‌ ఖాతాను ప్రారంభించింది. ఖాతాలో కనీస నిల్వ నిర్వహించనందుకు వసూలు చేసే ఫైన్‌ ఉండదు. అలాగే బ్యాంక్‌ అందించే విభిన్న రకాల సేవలకు ఈ అకౌంట్‌పై ఎలాంటి చార్జీ వసూలు చేయరు. నెలకి రూ.150 లేదా ఏడాదికి రూ.1650 చందాగా కడితే సరిపోతుంది. ఖాతాదారులు ఎన్ని రకాలైన సేవలైనా, ఎన్ని సార్లైనా ఉచితంగా పొందగలుగుతారు.

Updated Date - 2023-08-30T03:53:20+05:30 IST