శ్రీసిటీకి అవార్డు
ABN , First Publish Date - 2023-11-23T03:21:57+05:30 IST
బిజినెస్ వరల్డ్ పత్రిక ముంబైలో నిర్వహించిన సస్టైనబుల్ వరల్డ్ కాంక్లేవ్ అండ్ అవార్డు 5వ ఎడిషన్‌లో భారతదేశ అత్యంత ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ అవార్డును శ్రీసిటీ సొంతం చేసుకుంది.
వరదయ్యపాళెం: బిజినెస్ వరల్డ్ పత్రిక ముంబైలో నిర్వహించిన సస్టైనబుల్ వరల్డ్ కాంక్లేవ్ అండ్ అవార్డు 5వ ఎడిషన్‌లో భారతదేశ అత్యంత ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ అవార్డును శ్రీసిటీ సొంతం చేసుకుంది. బిజినెస్ వరల్డ్ చైర్మన్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ అనురాగ్ బాత్రా నుంచి శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ఈ అవార్డును అందుకున్నారు. శ్రీసిటీ చేపడుతున్న స్థిరమైన పట్టణీకరణ అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు పట్ల శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.