ఎయిడ్స్‌ ఔషధం తయారీకి ఎంపీపీతో అరబిందో ఒప్పందం

ABN , First Publish Date - 2023-03-31T01:48:12+05:30 IST

ఎయి డ్స్‌ (హెచ్‌ఐవీ) రావడానికి రిస్క్‌ ఉన్న వారిలో దాన్ని నివారించేందుకు వినియోగించే క్యాబొటిగ్రావిర్‌ టాబ్లెట్లు, దీర్ఘకాలం పని చేసే ఇంజెక్టబుల్స్‌ను తయారు చేసి అరబిందో ఫార్మా విక్రయించనుంది...

ఎయిడ్స్‌ ఔషధం తయారీకి ఎంపీపీతో అరబిందో ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎయి డ్స్‌ (హెచ్‌ఐవీ) రావడానికి రిస్క్‌ ఉన్న వారిలో దాన్ని నివారించేందుకు వినియోగించే క్యాబొటిగ్రావిర్‌ టాబ్లెట్లు, దీర్ఘకాలం పని చేసే ఇంజెక్టబుల్స్‌ను తయారు చేసి అరబిందో ఫార్మా విక్రయించనుంది. ఇందుకోసం మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో సబ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఔషధాన్ని వీఐఐవీ హెల్త్‌కేర్‌ అభివృద్ధి చేసింది. జెనరిక్‌ ఔషధానికి అవసరమైన ఏపీఐని కూడా అరబిందో తయారు చేసుకుంటుంది. నాయుడుపేటలోని యూనిట్‌ 4లో, విశాఖపట్నంలోని యూజియా స్టెరైల్‌ యూనిట్‌లో టాబ్లెట్లు, ఇంజెక్టబుల్స్‌ను తయారు చేస్తారు. ఎంపిక చేసిన మార్కెట్లకు టాబ్లెట్లు, ఇంజెక్టబుల్స్‌ను సరఫరా చేయనున్నట్లు అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-03-31T01:48:28+05:30 IST