AtherStack 5.0: ‘ఎథర్ స్టాక్ 5.0’ను విడుదల చేసిన ఎథర్ ఎనర్జీ.. ఫీచర్లు ఇవే!

ABN , First Publish Date - 2023-01-08T20:27:13+05:30 IST

ఎథర్ ఎనర్జీ (Ather Energy) తన మొట్టమొదటి కస్టమర్ ఈవెంట్ అయిన ఎథర్ కమ్యూనిటీ డేలో కొత్త ఆఫర్లు, ప్రకటనలతో నూతన సంవత్సరాన్ని ఆరంభించింది.

AtherStack 5.0: ‘ఎథర్ స్టాక్ 5.0’ను విడుదల చేసిన ఎథర్ ఎనర్జీ.. ఫీచర్లు ఇవే!

న్యూఢిల్లీ: ఎథర్ ఎనర్జీ (Ather Energy) తన మొట్టమొదటి కస్టమర్ ఈవెంట్ అయిన ఎథర్ కమ్యూనిటీ డేలో కొత్త ఆఫర్లు, ప్రకటనలతో నూతన సంవత్సరాన్ని ఆరంభించింది. స్టార్టర్స్ కోసం బిగ్గెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఎథర్ స్టాక్ 5.0(AtherStack)ను విడుదల చేసింది. ఇది డ్యాష్‌బోర్డు కోసం ఇంటర్‌ఫేస్ శక్తినిస్తుంది. అలాగే, గూగుల్ ఆధారిత వెక్టార్ మ్యాప్‌లను కూడా ఇది ప్రదర్శిస్తుంది. విద్యుత్ స్కూటర్‌కు ఇలాంటిది అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.

యూఐ అప్‌డేట్‌లో భాగంగా కొత్త రైడ్ యానిమేషన్ విద్యుత్ ఎంత ఉపయోగిస్తున్నదీ, ఎంత ఖర్చవుతున్నది వివిధ మోడల్‌లలో చూపిస్తుంది. ప్రయాణంలో రైడర్ చదివేందుకు ఇది మరింత స్పష్టంగా, సులభంగా ఉంటుంది. బ్రైట్‌నెస్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇన్‌కమింగ్ కాల్ నోటిఫికేషన్లను ఒకే క్లిక్‌తో ఆఫ్ చేయడానికి క్విక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అలాగే, 450X, 450 ప్లస్‌ ఈ-స్కూటర్లలో కాస్మిక్ బ్లాక్, సాల్ట్ గ్రీన్, ట్రూరెడ్, లూనార్ గ్రే అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్స్‌ను తీసుకొచ్చింది. సీటును కూడా సౌకర్యవంతంగా ఉండేలా రీడిజైన్ చేశారు. ఇది గతంలోని 450 స్కూటర్లకు కూడా అనువుగా ఉంటుంది కాబట్టి వారు కూడా దీనిని కొనుగోలు చేసుకోవచ్చు. ఐదేళ్ల ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారెంటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.

ఈ సందర్భంగా ఎథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా మాట్లాడుతూ.. 2018లో తాము ఎథర్‌స్టాక్‌ను విడుదల చేశామని, ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఎలాంటి ద్విచక్ర వాహనానికి అయినా ఇది సరిపోతుందని పేర్కొన్నారు. మార్కెట్లోనే తొలిసారి టచ్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, ఆన్‌బోర్డ్ నేవిగేషన్, రిమోట్ డయాగ్నోస్టిక్స్ శక్తిని ఇది కలిగి ఉందన్నారు. తాము అప్పుడు విడుదల చేసిన ఈ సాఫ్ట్‌వేర్ అప్పట్లో లగ్జరీ కార్లలో కూడా అరుదుగా ఉండేదన్నారు. తాజాగా విడుదల చేసిన ఎథర్ స్టాక్ 5.0 రైడర్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందన్నారు.

ఎథర్ స్టాక్ అనేది సాఫ్ట్‌వేర్ ఇంజిన్. దీనిని స్టాఫ్ట్‌వేర్, ఫర్మ్‌వేర్, సిస్టం ఇంటెలిజెన్స్, అల్గారిథమ్స్‌తో ఇంటర్‌కనెక్ట్ చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ వల్ల వినియోగదారులు వేగంగా ప్రయాణించవచ్చు. ఇతర ఈవీలతో పోలిస్తే ఎలాంటి డీరేటింగ్ లేకుండా స్కూటర్ గరిష్ఠ టార్క్‌ను పొందొచ్చు. కచ్చితంగా ఎంతదూరం ప్రయాణించవచ్చనే దానిని సరిగ్గా అంచనా వేస్తుంది. చార్జర్‌లో ప్లగ్ పెట్టగానే ఆటో కట్ ఆఫ్ అవుతుంది. ఫలితంగా బ్యాటరీ జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది. కాగా, నూతన 450X, 450 ప్లస్ వాహనాలు దేశవ్యాప్తంగా 70 నగరాలు, 89 ఎక్స్‌పీరియన్స్ కేంద్రాల్లో టెస్ట్ రైడ్‌కు, కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఎథర్ ఇప్పుడు బైక్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. తొలి 1000 మంది వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ వల్ల 450Xను రూ. 80 వేలకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. బై బ్యాక్ అప్‌గ్రేడ్ అవకాశాన్ని వినియోగించుకునే వారికి అదనంగా రూ. 10 వేల రాయితీ కూడా లభిస్తుంది. ఫలితంగా రూ. 70 వేలకే వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు.

Updated Date - 2023-01-08T20:27:16+05:30 IST