హైదరాబాద్‌లో మరో రెయిన్‌బో హాస్పిటల్‌

ABN , First Publish Date - 2023-03-02T01:34:00+05:30 IST

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ హైదరాబాద్‌లో మరో ఆసుపత్రిని ప్రారంభించింది...

హైదరాబాద్‌లో మరో రెయిన్‌బో హాస్పిటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ హైదరాబాద్‌లో మరో ఆసుపత్రిని ప్రారంభించింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభించిన ఈ ఆసుపత్రిలో 100 పడకలుంటాయి. దీంతో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, దాని అనుబంధ కంపెనీల పడకల సామర్థ్యం 1,655 పడకలకు పెరుగుతుంది. రూ.60 కోట్ల పెట్టుబడులతో కొత్త ఆసుపత్రిని నిర్మించినట్లు ఎక్స్ఛేంజీలకు పంపిన సమాచారంలో రెయిన్‌బో పేర్కొంది.

Updated Date - 2023-03-02T01:34:00+05:30 IST