Share News

నామినీల ప్రకటనకు మరో 6 నెలలు గడువు

ABN , Publish Date - Dec 28 , 2023 | 02:36 AM

డీమ్యాట్‌, మ్యూచువల్‌ పండ్‌ ఖాతాదారులు నామినీలను ప్రకటించేందుకు గడువును సెబీ వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబరు 31తో ముగియనుంది...

నామినీల ప్రకటనకు  మరో 6 నెలలు గడువు

న్యూఢిల్లీ: డీమ్యాట్‌, మ్యూచువల్‌ పండ్‌ ఖాతాదారులు నామినీలను ప్రకటించేందుకు గడువును సెబీ వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే ఇన్వెస్టర్లు తమ అనంతరం ఖాతాల్లోని సొమ్ము అందుకునేందుకు నామినీలుగా నియమించే అవకాశం మరింత ఎక్కువ కాలం ఇవ్వాలన్న లక్ష్యంతో సెబీ ఈ చర్య తీసుకుంది. విభిన్న వర్గాల నుంచి అందిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తెలిపింది. నామినీలను నియమించుకోవాల్సిందిగా ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని ఏఎంసీలు, డిపాజిటరీ భాగస్వాములు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు సెబీ సూచించింది.

Updated Date - Dec 28 , 2023 | 02:36 AM