యాక్సిస్‌కేడ్స్‌తో అమరరాజా గ్రూప్‌ కంపెనీ ఒప్పందం

ABN , First Publish Date - 2023-02-21T01:40:47+05:30 IST

అమరరాజా గ్రూప్‌ కంపెనీ మంగళ్‌ ఇండస్ట్రీస్‌.. టెక్నాలజీ సొల్యూషన్స్‌ కంపెనీ యాక్సి్‌సకేడ్స్‌ టెక్నాలజీ్‌సతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది...

యాక్సిస్‌కేడ్స్‌తో అమరరాజా గ్రూప్‌ కంపెనీ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమరరాజా గ్రూప్‌ కంపెనీ మంగళ్‌ ఇండస్ట్రీస్‌.. టెక్నాలజీ సొల్యూషన్స్‌ కంపెనీ యాక్సి్‌సకేడ్స్‌ టెక్నాలజీ్‌సతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పరిధిలోకి ఇంజనీరింగ్‌, డిజిటల్‌, తయారీ విభాగాలు వస్తాయని.. ఈ విభాగాల్లో రెండు కంపెనీలు సహకరించుకుంటాయని మంగళ్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ హర్షవర్థన్‌ గౌరినేని తెలిపారు. ఆటో కాంపోనెంట్స్‌, మెటల్‌ ఫ్యాబ్రికేషన్‌, కస్టమ్స్‌ ఫ్యాబ్రికేషన్‌ తదితర విభాగాల్లో మంగళ్‌ ఇండస్ట్రీస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రొడక్ట్‌ డిజైనింగ్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌ రంగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని యాక్సి్‌సకేడ్స్‌ ఎండీ, సీఈఓ అరుణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

Updated Date - 2023-02-21T01:40:50+05:30 IST