Share News

ఎయిరిండియాకు తొలి ‘ఎయిర్‌బస్‌ ఏ350’

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:43 AM

ఎయిరిండియాకు చెందిన తొలి వైడ్‌ బాడీ విమానం ‘ఎయిర్‌బస్‌ ఏ350-900’ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం 1.46కి ల్యాండ్‌ అయింది...

ఎయిరిండియాకు తొలి ‘ఎయిర్‌బస్‌ ఏ350’

న్యూఢిల్లీ: ఎయిరిండియాకు చెందిన తొలి వైడ్‌ బాడీ విమానం ‘ఎయిర్‌బస్‌ ఏ350-900’ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం 1.46కి ల్యాండ్‌ అయింది. భారత్‌లో ఈ మోడల్‌ విమానాన్ని కలిగిన తొలి ఎయిర్‌లైన్స్‌ ఎయిరిండియానే. ఎయిరిండియా ఈ మోడల్‌ విమానాలను 20 ఆర్డర్‌ చేసింది. 2024 మార్చి నాటికి ఎయిర్‌బస్‌ ఈ మోడల్‌కు చెందిన మరో 5 విమానాలను ఎయిరిండియాకు సరఫరా చేయనుంది. ‘‘ఎయిర్‌బస్‌ ఏ 350-900 విమాన ఆగమనం ప్రపంచ వేదికపై భారత విమానయాన రంగ పునరుత్థాన ప్రకటన లాంటిదని ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ అన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 03:43 AM