క్వింటెలియన్ మీడియాపై అదానీ పట్టు
ABN , First Publish Date - 2023-08-16T03:11:13+05:30 IST
రాఘవ్ బహల్ నాయకత్వంలోని క్వింటెలియన్ బిజినెస్ మీడియాలో డిజిటల్ న్యూస్ వ్యాపారాలన్నింటి పైన పూర్తి అదుపు సాధించే దిశగా అదానీ గ్రూప్ అడుగులు వేస్తోంది...
మిగతా 51 శాతం వాటాల కొనుగోలుకు ప్రణాళిక
న్యూఢిల్లీ: రాఘవ్ బహల్ నాయకత్వంలోని క్వింటెలియన్ బిజినెస్ మీడియాలో డిజిటల్ న్యూస్ వ్యాపారాలన్నింటి పైన పూర్తి అదుపు సాధించే దిశగా అదానీ గ్రూప్ అడుగులు వేస్తోంది. క్వింటెలియన్ మీడియాలో మిగతా 51 శాతం వాటాలు కూడా కొనుగోలు చేయాలని భావిస్తోంది. క్వింటెలియన్ మీడియాలో మిగతా వాటాల కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఎంఓయూకు తమ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన సందేశంలో తెలిపింది. బీక్యూ ప్రైమ్ (గతంలో బ్లూమ్‌బర్గ్ క్వింట్) పేరిట బిజినెస్, ఫైనాన్షియల్ న్యూస్ రెండింటినీ క్వింటెలియన్ మీడియా అందిస్తోంది గతంలో ఆ కంపెనీలో 49 శాతం వాటాలను ఏఎంజీ కొనుగోలు చేసింది.