ముంద్రాలో అదానీ సోలార్‌ ప్యానెళ్ల తయారీ యూనిట్‌

ABN , First Publish Date - 2023-10-03T03:17:01+05:30 IST

2027 నాటికి 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది...

ముంద్రాలో అదానీ సోలార్‌ ప్యానెళ్ల  తయారీ యూనిట్‌

న్యూఢిల్లీ: 2027 నాటికి 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్‌లోని ముంద్రాలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ గ్రూప్‌ 4 గిగావాట్ల సోలార్‌ మాన్యుఫాక్చరింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం అదానీ సోలార్‌ చేతిలో 3,000 మెగావాట్ల సోలార్‌ ప్యానెళ్ల ఎగుమతి ఆర్డర్లున్నాయి. వాటి సరఫరాకు 15 నెలల సమయం పట్టవచ్చని అంచనా.

Updated Date - 2023-10-03T03:17:01+05:30 IST