Adani slips to 4th : ప్రపంచ కుబేర జాబితాలో 4వ స్థానానికి జారిన అదానీ

ABN , First Publish Date - 2023-01-25T01:07:03+05:30 IST

ఆసియాలో అత్యంత ధనవంతుడు గౌతమ్‌ అదానీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో మాత్రం మెట్టు దిగారు..

Adani slips to 4th : ప్రపంచ కుబేర జాబితాలో 4వ స్థానానికి జారిన అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడు గౌతమ్‌ అదానీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో మాత్రం మెట్టు దిగారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌టైం ఇండెక్స్‌ ప్రకారం.. అదానీ గ్రూప్‌ అధిపతి మంగళవారం నాడు 3 నుంచి 4వ స్థానానికి జారుకోగా.. అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ 4 నుంచి 3వ స్థానానికి ఎగబాకారు. అదానీ వ్యక్తిగత సంపద 87.2 కోట్ల డాలర్లు తగ్గి 12,000 కోట్ల డాలర్లకు పరిమితం కాగా.. బెజోస్‌ నెట్‌వర్త్‌ 31.8 కోట్ల డాలర్లు పెరిగి 12,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. కాగా, లూయీ విట్టన్‌ గ్రూప్‌ అధిపతి బెర్నార్డ్‌ అర్నో 18,800 కోట్ల డాలర్ల ఆస్తితో ప్రపంచ నం.1 ధనవంతుడిగా కొనసాగుతుండగా.. 14,500 కోట్ల డాలర్ల సంపదతో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానంలో ఉన్నారు. టెస్లా షేర్ల భారీ పతనంతో మస్క్‌ ఈ మధ్యనే అగ్రస్థానాన్ని చేజార్చుకున్నారు.

Updated Date - 2023-01-25T01:09:43+05:30 IST