Share News

ఐసీఐసీఐ ప్రు పీఎంఎస్‌కు ఆదరణ

ABN , First Publish Date - 2023-10-15T03:32:33+05:30 IST

పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌)కు రోజురోజుకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ)లు ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లపై దృష్టి కేంద్రీకరిస్తూ వస్తుంటాయి...

ఐసీఐసీఐ ప్రు పీఎంఎస్‌కు ఆదరణ

పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌)కు రోజురోజుకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ)లు ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లపై దృష్టి కేంద్రీకరిస్తూ వస్తుంటాయి. అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ కంపెనీలు.. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ)పై దృష్టి పెడుతూ వస్తున్నాయి. ఈ ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేకమైన పథకాలను తీసుకువస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఏఎంసీలు నిర్వహిస్తున్న ఆస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ నిర్వహిస్తున్న ఆస్తుల్లో వృద్ధి ఏకంగా 90 శాతంగా ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌.. 2000 సంవత్సరం నుంచి ఈ పీఎంఎస్‌ సేవలను అందిస్తూ వస్తోంది. దీర్ఘకాలంలో మెరుగైన రిటర్నులు అందించే విధంగా తన పీఎంఎస్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వివిధ పెట్టుబడుల ఆప్షన్స్‌ను అందిస్తోంది. పీఎంఎస్‌ యూనిట్‌ బాధ్యతలను ఆనంద్‌ షా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పీఎంఎస్‌.. కాంట్రా, పైప్‌, ఫ్లెక్సీక్యాప్‌ వ్యూహాల ద్వారా ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అందిస్తోంది.

Updated Date - 2023-10-15T03:32:33+05:30 IST