వేదాంత నిధుల వేట

ABN , First Publish Date - 2023-05-26T04:53:07+05:30 IST

ప్రవాస భారత పారిశ్రామికవేత్త అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంత రీసోర్సెస్‌ లిమిటెడ్‌ (వీఆర్‌ఎల్‌) తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది.

వేదాంత నిధుల వేట

న్యూఢిల్లీ: ప్రవాస భారత పారిశ్రామికవేత్త అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంత రీసోర్సెస్‌ లిమిటెడ్‌ (వీఆర్‌ఎల్‌) తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది. ఈ సమస్య నుంచి కొంతవరకైనా బయటపడేందుకు హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌) ఈక్విటీలో తనకున్న 64.9 శాతం వాటా షేర్లును తాకట్టు పెట్టింది. తద్వారా సమకూరిన నిధులతో ఈ ఏడాది ఏప్రిల్‌లో చెల్లించాల్సిన రుణాలు, రుణ పత్రాలను గత నెల రోజుల్లో చెల్లించింది. దీంతో వీఆర్‌ఎల్‌ అప్పుల భారం 780 కోట్ల డాలర్ల నుంచి 680 కోట్ల డాలర్లకు తగ్గింది. అయినా వచ్చే ఏడాది మార్చిలోపు చెల్లించాల్సిన 410 కోట్ల డాలర్ల అప్పులు ఎలా చెల్లించాలో కంపెనీకి పాలుపోవడం లేదు. ఇందులో కనీసం 200 కోట్ల డాలర్లయినా రీఫైనాన్సింగ్‌ ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే రెండు మూడు నెలల్లో ఇది సాధ్యం కాకపోతే వేదాంత ఆర్థిక సమస్యలు మరింత ముదిరే అవకాశం ఉంది.

Updated Date - 2023-05-26T04:53:07+05:30 IST