అమెరికాలోని చిన్న బ్యాంకులకు షాక్‌

ABN , First Publish Date - 2023-03-26T04:10:57+05:30 IST

ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల వైఫల్య ప్రభావంతో అమెరికాలోని చిన్న బ్యాంకుల నుంచి డిపాజిట్లను ఉపసంహరించుకునేందుకు ఖాతాదారులు క్యూ కడుతున్నారు...

అమెరికాలోని చిన్న బ్యాంకులకు షాక్‌

ఈనెల 15తో ముగిసిన వారంలో రూ.9.85 లక్షల కోట్ల డిపాజిట్ల ఉపసంహరణ

వాషింగ్టన్‌: ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల వైఫల్య ప్రభావంతో అమెరికాలోని చిన్న బ్యాంకుల నుంచి డిపాజిట్లను ఉపసంహరించుకునేందుకు ఖాతాదారులు క్యూ కడుతున్నారు. యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ తాజా డేటా ప్రకారం.. ఈ నెల 15తో ముగిసిన వారంలో అమెరికాలోని చిన్న బ్యాంక్‌ల్లోని డిపాజిట్లు 12,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.9.85 లక్షల కోట్లు) మేర తగ్గి 5.46 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత రికార్డు తగ్గుదల కంటే రెండింతలకు పైగా అధికమిది. మొత్తం డిపాజిట్ల విలువ తగ్గుదల శాతం పరంగా చూస్తే, 2007 మార్చి 16తో ముగిసిన వారం తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. కాగా, సమీక్షా కాలానికి బడా అమెరికన్‌ బ్యాంక్‌ల్లోని డిపాజిట్లు 6,700 కోట్ల డాలర్ల మేర పెరిగి 10.74 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. వైఫల్యాల భయంతో ఖాతాదారులు చిన్న బ్యాంక్‌ల్లోని డిపాజిట్లను పెద్ద బ్యాంక్‌ల్లోకి బదలాయించుకుంటున్నారనడానికి ఇదే సంకేతమని బ్యాంకింగ్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-26T04:10:57+05:30 IST