అపోలో మైక్రోసిస్టమ్స్‌ కొత్త యూనిట్‌

ABN , First Publish Date - 2023-10-03T03:19:23+05:30 IST

రక్షణ రంగానికి అవసరం అయిన ఎలక్ర్టానిక్స్‌ తయారీ సహా విభిన్న ఉత్పత్తులు అందించే అపోలో మైక్రోసిస్టమ్స్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ కోసం కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేసే...

అపోలో మైక్రోసిస్టమ్స్‌ కొత్త యూనిట్‌

అపోలో మైక్రోసిస్టమ్స్‌ కొత్త యూనిట్‌

హైదరాబాద్‌: రక్షణ రంగానికి అవసరం అయిన ఎలక్ర్టానిక్స్‌ తయారీ సహా విభిన్న ఉత్పత్తులు అందించే అపోలో మైక్రోసిస్టమ్స్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ కోసం కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. హార్డ్‌వేర్‌ పార్క్‌లో ఏర్పా టు చేయనున్న ఈ యూనిట్‌ కోసం దసరా రోజున భూమి పూజ నిర్వహించి 9 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేయాలని కంపెనీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి రూ.150 కోట్లని అంచనా. కంపెనీకి ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులతో పాటు ఈ కొత్త యూనిట్లు అదనంగా 3 లక్షల చదరపు అడుగుల మౌలిక వసతులు జోడిస్తాయని భావిస్తున్నారు. ఇక్కడ రక్షణ ఎలక్ర్టానిక్స్‌, ఎలక్ర్టో మెకానికల్‌ తయారీ యూనిట్లతో పాటు ఐఎన్‌ఎస్‌, ఐఎంయు, ఏహెచ్‌ఆర్‌ఎ్‌సలకు అవసరమైన నావిగేషనల్‌ సిస్టమ్స్‌ టెస్టింగ్‌, క్యాలిబ్రేషన్‌ వసతులు కూడా ఉంటాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ కోసం ఇప్పటికే డీఆర్‌డీఓతో టెక్నాలజీ బదిలీ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బద్దం కరుణాకర్‌ రెడ్డి చెప్పారు. డీఆర్‌డీఓతో తమ భాగస్వామ్యంలో ఈ ఒప్పందాలు కీలకమైన మైలురాయి కాగలవన్నారు.

Updated Date - 2023-10-03T03:19:23+05:30 IST