ఎంఎస్‌ఎంఈలకు 9,000 కోట్ల రుణ హామీ పథకం

ABN , First Publish Date - 2023-02-02T03:26:01+05:30 IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈల)కు రుణ హామీ పథకాన్ని కొనసాగించేందుకు రూ.9,000 కోట్ల కార్ప్‌సను...

ఎంఎస్‌ఎంఈలకు 9,000 కోట్ల రుణ హామీ పథకం

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈల)కు రుణ హామీ పథకాన్ని కొనసాగించేందుకు రూ.9,000 కోట్ల కార్ప్‌సను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలు మరో రూ.2 లక్షల కోట్ల తనఖా రహిత రుణాలు పొందేందుకు ఈ కార్పస్‌ ఉపయోగపడనుందని, అంతేకాదు, వారికి రుణాలపై వడ్డీ భారం ఒక శాతం మేర తగ్గనుందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు, కరోనా కాలంలో కాంట్రాక్టును అమలు చేయడంలో విఫలమైన ఎంఎ్‌సఎంఈలకు బిడ్‌ లేదా సెక్యూరిటీ సొమ్ములో 95 శాతాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు తిరిగి ఇచ్చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు.

Updated Date - 2023-02-02T03:26:02+05:30 IST