ఈ ఏడాది చిన్న సంస్థలకు రూ.800 కోట్ల రుణాలు

ABN , First Publish Date - 2023-06-07T02:46:05+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు రూ.800 కోట్ల కొలేటరల్‌-ఫ్రీ రుణాలు ఇవ్వాలని...

ఈ ఏడాది చిన్న సంస్థలకు రూ.800 కోట్ల రుణాలు

కినారా క్యాపిటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు రూ.800 కోట్ల కొలేటరల్‌-ఫ్రీ రుణాలు ఇవ్వాలని కినారా క్యాపిటల్‌ భావిస్తోంది. 2016లో తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ 20,000 వ్యాపార రుణాలను ఇచ్చినట్లు కినారా క్యాపిటల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆర్‌ తిరు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ.1,200 కోట్ల రుణాలను ఇచ్చినట్లు చెప్పారు. దీర్ఘ, స్వల్పకాల వర్కింగ్‌ క్యాపిటల్‌, మిషనరీ కొనుగోలు, బిల్‌ డిస్కౌంటింగ్‌ మొదలైన వాటికి రూ.లక్ష నుంచి 30 లక్షల వరకూ రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో కినారాకు 27 శాఖలు ఉన్నాయి.

Updated Date - 2023-06-07T02:46:05+05:30 IST